![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -94 లో.....రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు రెడీ అయి ప్రెస్ మీట్ కి వస్తారు. అమ్మ ఎవరో ఏదో అన్నారని ప్రెస్ మీట్ పెట్టి.. మేమ్ భార్యాభర్తలమని అందరి ముందు చెప్పమన్నావ్.. అందుకే చెప్పడానికి వచ్చామని అనగానే శ్రీలత షాక్ అవుతుంది.. ఎవరో ఏదో అన్నారని ఇంట్లో వాళ్లే మమ్మల్ని నమ్మకుండా ఇలా నిరూపించుకోమని చెప్పారు.
ఆ తర్వాత, ఈరోజు అన్నారని మేమ్ నిరూపించూకుంటాం.. మళ్ళీ రేపు ఇలా అనరని గ్యారెంటీ ఏంటి? వాళ్ళు అన్నారని మేమ్ మీడియా ముందుకు రావడం లేదు.. కేవలం అమ్మ కోసం మాత్రమే ప్రెస్ మీట్ ముందుకు వెళ్తున్నాం.. నా ఫ్యామిలీనే మమ్మల్ని నమ్మడం లేదు అందుకే అని సీతాకాంత్ అంటాడు. అప్పుడే సీతకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చి.. మీరు పెళ్లి చేసుకున్నారని మేమ్ నమ్ముతున్నాం ప్రెస్ మీట్ వద్దని చెప్తాడు. ఆ తర్వాత సిరి, ధన కూడా అదే మాట అంటారు. ఇప్పుడు మనం అనకుంటే మనపై డౌట్ వస్తుందని శ్రీలత, సందీప్ కూడా అనుకుంటారు. మేమ్ కూడా నమ్ముతున్నామని సీతాకాంత్ దగ్గరకి శ్రీలత వెళ్లి చెప్తుంది. ఆ తర్వాత అందరు వెళ్ళిపోతారు. చూసావా రామలక్ష్మిపై ప్రేమతో తనని బాధపెట్టడం ఇష్టం లేక సీతాకాంత్ ఎంత తెలివిగా తప్పించుకున్నాడోనని సందీప్ తో శ్రీలత అంటుంది.
ఆ తర్వాత ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయినందుకు రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థాంక్స్ సర్ అని సీతాకాంత్ తో చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి వెళ్తుంటే చీర కొంగు తట్టుకొని సీతాకాంత్ పై పడిపోతుంది. మరొకవైపు మాణిక్యం చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి వెళ్తాడు. ఎలాగైనా నా టూ ఇయర్స్ అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయో తీసుకోవాలని మాణిక్యం అనుకొని సీతాకాంత్ క్యాబిన్ లో వెతుకుతుంటాడు.. అప్పుడే సీతాకాంత్ రావడం గమనించి టేబుల్ కింద దాక్కొని ఉంటాడు. అప్పుడే ఎంప్లాయి వచ్చి మీ కోసం అభి అనే వ్యక్తి వచ్చాడని సీతాకాంత్ కి చెప్తాడు. ఆ మాట మాణిక్యం వింటాడు. మాణిక్యం టేబుల్ కింద ఉండడం సీతాకాంత్ చూస్తాడు.. అభితో మాట్లాడి వెళ్లె వరకు మాణిక్యం బయటకు రాకూడదంటూ డోర్ వేసి సీతాకాంత్ వెళ్తాడు.. ఆ తర్వాత చాలా తెలివిగా ప్రెస్ మీట్ తప్పించారు కదా సర్.. నేను చెప్పిందేం చేశారు.. నాకు ఊటి అంటే చాలా ఇష్టం.. అక్కడ ఒక రిసార్ట్ కొనివ్వండని అభి చెప్పగానే.. సీతాకాంత్ షాక్ అవుతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |